సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎగిరిపడ్డారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఈరోజు జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ మంటల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు టైలరింగ్ షాపులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంలో విజయం సాధించగా., అయితే అప్పటికి మంటల్లో ఏడుగురు మరణించారు. Also read: Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి…
Istanbul: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 8 మంది గాయపడినట్లు నగర గవర్నర్ తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇస్లాంగర్ పట్టణంలోని బాణాసంచా గోదాములో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు చెల్లాచెదురైంది. ప్రమాదం జరిగిన బాణసంచా గోదాము బిల్సీ రోడ్డులో ఉంది. అయితే.. ఈ ప్రమాదంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అందరు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లైవ్ విద్యుత్ తీగలను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరుకు పరిచయం అవసరం లేదు.. పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం సాంగ్స్ తో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈమెను ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లలో చూశారు.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను వదులుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈమె ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు…
44 Killed in Dhaka Fire Accident: బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగి.. కనీసం 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. చాలా మంది అపస్మారక స్థితిలో ఉండగా.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే…
హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నాడు అర్థరాత్రి సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది.
రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా.. ఫ్యాక్టరీలోని రేకులు మొత్తం చెల్లాచెదురు అయ్యాయి. అయితే కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు.