Fire Accident: టాటా గ్రూప్ కంపెనీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. శనివారం ఉదయం టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ టాటా తయారీ యూనిట్ నుంచి నల్లటి పొగ బయటకు రావడం కనిపించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినప్పుడు 1500 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు…
Fire Accident: మేడ్చల్ జిల్లా సూరారం చౌరస్తా లోని ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాప్ ముందు బాబ్రీ బైక్ చార్జింగ్ పెట్టడంతో వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా పరిధిలో ఈ రోజు (శనివారం) ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని హోసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Chennai : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం తిరిగి బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
గుంటూరులో మరొకసారి ఓ కెమికల్ ఇండస్ట్రీ లో మంటలు చెలరేగాయి.. గుంటూరు రత్నగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.. రెండు రోజుల క్రితం ఇదే కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది..
Fire Accident: కెన్యా దేశంలోని నైరీ కౌంటీలోని హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మరణించగా, మరో 13 మంది తీవ్రంగా కాలిపోయారు. అక్కడి పాఠశాలలోని వసతి గృహంలో గురువారం రాత్రి మంటలు ఒక్కసారిగా పెద్దెత్తున చెలరేగాయి. ఇకపోతే ఈ విషాద ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని అక్కడి పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ఇక ఘోర అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. “మేము కారణాన్ని…
Fire Accident : ఒడిశాలోని పూరీ జిల్లా సత్యవాడి బ్లాక్‌లోని అలిస్సా గ్రామంలో సోమవారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 15 కుటుంబాలకు చెందిన 30కి పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు.