Rangareddy Fire Accident: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది.
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
Fire Accident In Mumbai: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న భంగర్వాడిలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. రాత్రి 8 గంటల సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వాహనాలు అంధేరీ ఈస్ట్‌లోని భంగర్‌వాడి ప్రాంతానికి…
విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. జైలు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మంటలు మంటలు చెలరేగాయి.. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు
నిద్రలోనే తల్లి కూతుళ్లు మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్‌లోని గడ్డం కనకయ్య ఇంట్లో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించి ఇద్దరు మహిళలు గుర్తుపట్టనంతగా కాలిపోయి మృతి చెందారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు.
జనగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయషాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. షాపింగ్‌మాల్ పూర్తిగా దగ్ధమైంది.
Fire Accident in Kolkata: సెంట్రల్ కోల్‌కతాలోని ఎజ్రా స్ట్రీట్ సమీపంలోని టెరిటీ బజార్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో.. 15 ఫైర్ ఇంజన్లను ఒక్కొక్కటిగా సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనలో మంటలను ఆర్పే పని అర్థరాత్రి వరకు కొనసాగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. చెక్క పెట్టెల…
Fire Accident In Hospital: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో మొత్తం ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో ఒక రోగి మృతి చెందాడు. మంటలు చెలరేగినప్పుడు చాలా మంది రోగులు సీల్దా ప్రాంతంలో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఆసుపత్రిలో ఉన్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 అగ్నిమాపక వాహనాలు ఆసుపత్రికి చేరుకొని, ఘటనా స్థలం నుంచి…
Fire Accident: ముంబైలోని చెంబూర్‌లోని సిద్ధార్థ్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం. చనిపోయిన వారిలో ఓ బాలిక, పదేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్య జరిగింది. G+2 ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఇంటి క్రింద ఒక కిరాణా దుకాణం ఉంది. దాని పైన రెండు అంతస్తుల ఇల్లు నిర్మించబడింది.…