బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేసి.. ఆపై ఇంటిని తగుల బెట్టారు. మష్రాఫే షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అతని ఇంటిపై నిరసనకారులు దాడి చేసినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ అబిడ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కామర్షియల్ కంప్లెక్స్ రెనవేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాజ్ మహాల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. అయితే పక్కనే ఒ వెల్డింగ్ షాపు ఉండటంతో.. వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వల వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
Hyderabad Fire Accident Today: హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్లోని ఓ ఫర్నిచర్ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భవనం పరిసర ప్రాంతంలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పది ఫైర్ ఇంజిన్ల సాయంతో…
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.
Fire Accident In AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వ అత్యవసర విచారణ జరిగింది. కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్దం అయ్యాయని సమాచారం.
Fire Accident: హనుమకొండ చౌరస్తా లో ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ లోని ఖాదీమ్స్ ఫుట్ వెర్ షాప్ లో షార్ట్ సర్కుట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు బుధవారం రాత్రి ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీదత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్లో మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి.