Fire Accident : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని SSV ప్యాబ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది.. ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారీ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. సంఘటనా స్థలానికి 3 పైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపుచేయడానికి పైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. ఆస్తి నష్టం భారీ గా ఉండవచ్చని సమాచారం.. సంఘటనా స్థలానికి జీడిమెట్ల సీఐ, బాలానగర్ ఏసీపీ చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా…
ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. తాజాగా హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ఆరోరా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో సూరారానికి చెందిన కార్మికుడు అనిల్ కుమార్ మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి..
School Bus Caught Fire: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని కౌశాంబి ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7:30 గంటల సమయంలో శ్రీశ్రీ రెసిడెన్సీ వెనుక ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ వైశాలి నుండి చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాలిపోతున్న బస్సుకు మంటలను అదుపులోకి…
కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగి, నల్లటి పొగతో అల్లుకున్నాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు నిలిపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.
Fire Accident: పంజాబ్ లోని లూథియానా పరిధిలోని నూర్వాలా రోడ్డు సమీపంలోని బసంత్ స్ట్రీట్ లోని రెండంతస్తుల భవనంలో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులోని ఓ బట్టల దుకాణం సమీపంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో కారు కూడా దగ్ధమైనట్లు అధికారి తెలిపారు. మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయని, అయితే స్టాక్ ఇంకా ఫైర్ సేఫ్టీ చర్యలపై కొంత ఉద్రిక్తత ఉందని అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ మణిందర్ సింగ్ తెలిపారు.…
Rangareddy Fire Accident: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది.
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
Fire Accident In Mumbai: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న భంగర్వాడిలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. రాత్రి 8 గంటల సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వాహనాలు అంధేరీ ఈస్ట్‌లోని భంగర్‌వాడి ప్రాంతానికి…
విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. జైలు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మంటలు మంటలు చెలరేగాయి.. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు
నిద్రలోనే తల్లి కూతుళ్లు మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్‌లోని గడ్డం కనకయ్య ఇంట్లో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించి ఇద్దరు మహిళలు గుర్తుపట్టనంతగా కాలిపోయి మృతి చెందారు.