Fire Accident in Kolkata: సెంట్రల్ కోల్‌కతాలోని ఎజ్రా స్ట్రీట్ సమీపంలోని టెరిటీ బజార్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో.. 15 ఫైర్ ఇంజన్లను ఒక్కొక్కటిగా సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనలో మంటలను ఆర్పే పని అర్థరాత్రి వరకు కొనసాగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. చెక్క పెట్టెల గోదాములో మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. కొద్దిసేపటికే మంటలు సమీపంలోని దుకాణాలకు వ్యాపించి భయానక రూపం దాల్చాయి. చాలా దూరంగా నుండి అగ్ని జ్వాలలు కనిపించాయి. ఈ మంటల్లో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. మంటలు చెలరేగిన ప్రాంతంలో విద్యుత్తు వస్తువులు విక్రయించే దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
Read Also: Maharashtra Polls: 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఉద్ధవ్ థాకరే
దానా తుఫాను ముందస్తు ప్రభావం కారణంగా వీస్తున్న గాలి కారణంగా గోదాం నుండి ఇతర దుకాణాలకు మంటలు త్వరగా వ్యాపించాయని స్థానికులు పేర్కొంటున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, అగ్నిమాపక శాఖ అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. తొలుత రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, మంటలు మరింత వ్యాపించడంతో మరిన్ని అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చివరి సమయానికి ఆ సంఖ్య 15కి పెరిగింది.
Read Also: Mokshagnya : డిసెంబర్ 2 మోక్షజ్ఞ సినిమా షురూ..?
#WATCH | West Bengal: A massive fire broke out in an electrical godown at Kolkata's Ezra Street. 15 fire tenders have reached the spot. Fire has been brought under control now. pic.twitter.com/M2hHCcBquL
— ANI (@ANI) October 23, 2024