Fire Accident: ముంబైలోని చెంబూర్‌లోని సిద్ధార్థ్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం. చనిపోయిన వారిలో ఓ బాలిక, పదేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్య జరిగింది. G+2 ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఇంటి క్రింద ఒక కిరాణా దుకాణం ఉంది. దాని పైన రెండు అంతస్తుల ఇల్లు నిర్మించబడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదట షాపులో మంటలు చెలరేగి ఆ తర్వాత ఇల్లంతా వ్యాపించాయి.
Also Read: Iran Israel War: మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి.. 18 మంది మృతి
ఇక మరో సంఘటనలో శనివారం రాత్రి ‘భారత్ ఇండస్ట్రియల్ ఎస్టేట్’ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చామని అగ్నిమాపక శాఖ అధికారి ఆదివారం తెలిపారు. సెవ్రీ ప్రాంతంలోని ఐదు అంతస్తుల ‘భారత్ ఇండస్ట్రియల్ ఎస్టేట్’ భవనంలో రాత్రి 10 గంటలకు మంటలు చెలరేగాయని అధికారి తెలిపారు. ఇది లెవల్-2 అగ్నిప్రమాదం అని తెలిపారు.
Also Read: Acid Attack: 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్.. మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
#Mumbai #Chembur के सिद्धार्थ कॉलोनी में एक चॉल के कमरे में लगी आग..आज सुबह की घटना..दमकल की 5 गाड़ियों ने आग पर काबू पाया..चॉल के नीचे बनी एक दुकान के एलेट्रिक वायरिंग में अचानक लगी आग..हादसे में 2 बच्चों समेत 5 की मौत#Fire@TNNavbharat @mybmc @CMOMaharashtra pic.twitter.com/VeT7G77Yo9
— Atul singh (@atuljmd123) October 6, 2024