AP Govt: ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఉద్యోగుల సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్‌ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రీమియర్‌లతో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read : Hari Hara Veera Mallu:…
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే…
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు.
కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన అంశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అనేక ప్రగల్బాలు పలికి గద్దేనెక్కి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసారని, 10నెలల కాంగ్రెస్ 10ఏళ్ల బీఆరెస్ పాలన దొందు దొందే రెండు పార్టీల పాలన ఒక్కటే అని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు రెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ఆర్థిక అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు.