బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీం ఇండియా జట్ల మధ్య ఐదో(చివరి)టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సిరీస్‌లో చివరి 3 మ్యాచ్‌ల్లో రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.
బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో టీమిండియా చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా నాలుగో రోజు బౌలింగ్ వైఫల్యం జట్టు కొంప ముంచింది. దీంతో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు ఏ విధంగానూ ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి నాంది…
బర్మింగ్ హామ్ వేదికగా నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌ను ఐసీసీ తాజాగా నిర్వహిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, డ్రా అయినా సిరీస్ మన సొంతం అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. రోహిత్ శర్మకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ మ్యాచ్‌కు సారథిగా బుమ్రా వ్యవహరించనున్నాడు. వైస్…
సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. నామమాత్రంగా మిగిలిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 271 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 124 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.…
భారత్-ఇంగ్లాండ్ జాత్మ మంధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన 5 వ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కేసులు నమోదుకావడంతో ఈ మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను మళ్ళీ నిర్వహిస్తారా… లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. దాదా మాట్లాడుతూ… ఈ 5 టెస్టుల సిరీస్ పూర్తిగా జరగాలి. ఇప్పటికే 2-1…