యాషెస్ చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియాదే విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. నామమాత్రంగా మిగిలిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 271 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 124 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.
Read Also: అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం.. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ
Also Read
- Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
ఇంగ్లండ్ జట్టులో క్రాలీ (36) అత్యధిక స్కోరు చేశాడంటే మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎంత ఘోరంగా ఆడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమిన్స్, బోలాండ్, గ్రీన్ తలో మూడు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా తొలి మూడు టెస్టుల్లో గెలిచి ఆస్ట్రేలియా ఎప్పుడో సిరీస్‌ను గెలుచుకుంది. నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్ నెగ్గింది. కాగా కెప్టెన్‌గా కమిన్స్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.
తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?