Lionel Messi's Car Gets Mobbed By Fans In Rosario: ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎక్కడికి వెళ్లినా అభిమాన సంద్రం ఎదురవుతోంది. తనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడుతున్నారు. ఇటీవల ఖతార్ లో జరిగిన ఫిపా వరల్డ్ కప్-2022లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఫైనల్స్ లో ఫ్రాన్స్ ను చిత్తు చేసి 36 ఏళ్ల తరువాత తన దేశానికి వరల్డ్ కప్ అందించారు.
ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను పోలిన వ్యక్తి కనిపించాడు.
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మేరకు స్టేడియాన్ని సిద్ధం చేస్తున్న ఒక వర్కర్ ఎత్తు నుంచి కింద పడి మరణించాడు. ఈ విషయాన్ని ఖతార్ అధికారులు వెల్లడించారు. లుసైల్ స్టేడియం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్ పనుల…
Journalist Khalid al-Misslam Dies During World Cup In Qatar: ఫిపా ప్రపంచకప్ 2022కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి వచ్చే ప్రపంచ పుట్ బాల్ అభిమానులు మాత్రం తమ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. వస్త్రధారణ, స్వలింగ సంపర్కం వంటి వాటిపై నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే స్వలింగ సంపర్కులకు మద్దతు తెలిపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా.. వారిని వెంటనే జైళ్లలో వేస్తోంది.
Fifa World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పోటీ పడ్డాయి. క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా సెమీఫైనల్ చేరాయి. వీటిలో రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడతాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందనే విషయంలో పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ప్రపంచంలో అన్ని మెగా టోర్నీల కంటే ఫిఫా ప్రపంచకప్‌లో వచ్చే ప్రైజ్ మనీ ఎక్కువగా ఉంటుంది.…