Riots Break Out In Paris After France Lost In FIFA World Cup Final: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా సంచలన విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలుపొందింది. దీంతో ఆ దేశస్థులు సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ.. తమ దేశం ఓడిపోవడాన్ని ఫ్రాన్స్ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. గెలుపు అంచులదాకా వెళ్లి ఓడిపోవడంతో.. ఫ్రాన్స్ ఫ్యాన్స్ తీవ్ర మనోవేదనకు, ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులతోనూ ఘర్షణకు దిగారు. ఫలితంగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారుల్ని అడ్డుకోవడానికి మరో దారిలేక.. పోలీసులు టియర్ గ్యాస్ వినియోగించారు. హింసకు పాల్పడిన వందల మంది అభిమానులను అరెస్టు చేశారు.
Raghunandan Rao: రాజకీయం అంటే.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదు
ఫైనల్ మ్యాచ్ కావడంతో.. దీన్ని వీక్షించేందుకు ప్రఖ్యాత ఛాంప్స్-ఎలిసీస్ అవెన్యూకి వేలాదిమంది అభిమానులు తరలివెళ్లారు. ఆ ప్రాంతం జనాలతో నిండి ఉండటంతో.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పోలీసులు దారి మళ్లించారు. భద్రత కోసం వేలమంది పోలీసుల్ని మోహరించారు కూడా! మ్యాచ్ జరిగేంతవరకూ అక్కడి వాతావరణం ప్రశాంతంగానే ఉంది. ఎంతో ఎగ్జైటింగ్‌గా అభిమానులు ఆ మ్యాచ్‌ని వీక్షించారు. కానీ.. ఫ్రాన్స్ ఓడిన మరుక్షణమే పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. అభిమానులు రోడ్లపైకి వచ్చి.. ఆందోళన చేపట్టారు. ఫైనల్‌గా పోలీసులు తమదైన శైలిలో పరిస్థితిని అదుపు చేసి, రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనల్లో ఇద్దరు అభిమానులు మరణించడం దురదృష్టకరం. కాగా.. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో తొలుత నిర్దిష్ట సమయం ముగిసేలోపు ఇరుజట్లు 2-2 పాయింట్లతో సమంగా ఉన్నారు. అదనపు సమయం కేటాయించగా, చెరో గోల్ చేయడంతో 3-3తో మ్యాచ్ మళ్లీ టై అయ్యింది. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించగా.. అర్జెంటీనా నాలుగు బంతుల్ని గోల్స్‌గానూ, ఫ్రాన్స్ కేవలం 2 బంతుల్ని గోల్స్‌గానూ మలిచాయి. తద్వారా అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది.
Week Movies: ఈ వారం సినిమాలు ‘అవతార్ 2’ దెబ్బకి గల్లంతవుతాయా?