ఫిఫా ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లను ప్రసారం చేయకుండా సౌదీ అరేబియా ఖతార్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను బ్లాక్ చేసింది. దీంతో చాలా మంది క్రీడాభిమానులు సౌదీ అరేబియా ఆటగాళ్ల విజయాన్ని చూడలేకపోయారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంలో భాగంగా గురువారం అల్-వక్రాలోని అల్ జనోబ్ స్టేడియంలో జట్ల మధ్య జరిగిన గ్రూప్-జీ మ్యాచ్‌లో కామెరూన్‌పై స్విట్జర్లాండ్ 1-0తో విజయం సాధించింది. బ్రీల్ ఎంబోలో గేమ్ ఏకైక గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ విజయం సాధించింది.
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను పసికూడ సౌదీ అరేబియా ఓడించి చరిత్ర సృష్టించింది. బుధవారం కూడా మరో సంచలనం నమోదైంది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.…
FIFA World Cup: ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో మూడో రోజు పెను సంచలనం నమోదైంది. బలమైన జట్టు అర్జెంటీనాకు షాక్ తగిలింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫుట్‌బాల్‌లో తిరుగులేని జట్టుగా పేరున్న అర్జెంటీనాను 2-1 తేడాతో సౌదీ అరేబియా ఓడించి పెను సంచలనం నమోదు చేసింది. అర్జెంటీనా తరఫున సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మాత్రమే గోల్ చేశాడు. ఆట మొదలైన 9వ…
Foot Ball: ప్రపంచంలో అత్యధికులను ఆకర్షించే ఆట ఏది అంటే 'ఫుట్ బాల్' అనే సమాధానమే వినిపిస్తుంది. మనదేశంలో 'ఫుట్ బాల్' క్రేజ్ అంతగా లేదు. కానీ, అగ్ర రాజ్యాలు మొదలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం 'సాకర్' ఆటపైనే గురి పెడుతున్నాయి.
Reliance Jio: భారీ అంచనాల నడుమ ఫిఫా ప్రపంచకప్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీ ప్రసార హక్కులను రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో వయాకామ్ 18, వూట్ యాప్, జియో సినిమా యాప్ ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. వూట్ యాప్ ఈ మ్యాచ్‌లను చూడాలంటే అభిమానులు రూ.599తో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. దీంతో ఫుట్‌బాల్ అభిమానులు జియో సినిమా యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. కానీ అభిమానులకు తీవ్ర నిరాశ…