Qatar: ఖతార్‌లో వరసగా జర్నలిస్టుల మరణాలు.. ప్రభుత్వ ప్రమేయంపై అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Khalid al-Misslam Dies During World Cup In Qatar: ఫిపా ప్రపంచకప్ 2022కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి వచ్చే ప్రపంచ పుట్ బాల్ అభిమానులు మాత్రం తమ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. వస్త్రధారణ, స్వలింగ సంపర్కం వంటి వాటిపై నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే స్వలింగ సంపర్కులకు మద్దతు తెలిపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా.. వారిని వెంటనే జైళ్లలో వేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఖతార్ లో వరసగా ఇద్దరు జర్నలిస్టులు మరణించారు. అసలు ఖతార్ లో ఏం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ కప్ న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ ఖలీద్ అల్ మిస్లామ్ మరణించారు. రోజుల వ్యవధిలో ఇది రెండో జర్నలిస్టు మరణం. అంతకు ముందు అమెరికా జర్నలిస్టు గ్రాంట్ వాల్ అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ కవర్ చేస్తున్న సమయలో కుప్పకూలి మరణించారు. ఈయన చనిపోయిన తర్వాత 48 గంటల్లోనే ఖలీద్ అల్ మిస్లామ్ మరణించారు.
Also Read
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
అంతకుముందు స్వలింగ సంపర్కులు, LGBTQ కమ్యూనిటీకి మద్దతుగా రెయిన్‌బో టీ-షర్టు ధరించాడు గ్రాంట్ వాల్. ఈయన మరణించిన తర్వాత మరో ఘటన జరిగింది. ఖలీద్ ఆదివారం మరణించాడు. అయితే ఆయన మరణానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. ఫిఫా మ్యాచులు కవర్ చేస్తున్న సమయంలో ఖలీద్ మరనించినట్లు ఖతార్ పేర్కొంది. అయితే వరసగా ఇలా మరణాలు చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాల్లో ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ మరణంలో ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు అతని సోదరుడు ఎరిక్ ఆరోపించారు. స్వలింగ సంపర్కులకు మద్దతుగా రెయిన్ బో టీ షర్టు ధరించినందుకు ఖతార్ ప్రభుత్వం గ్రాంట్ వాల్ ను కొంతకాలం నిర్భంధించింది. కాగా ఖతార్ చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం అనేది అక్కడ తీవ్రమైన నేరం.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!