FIFA Womens World Cup: ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ స్పెయిన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. స్పెయిన్ తరఫున ఏకైక గోల్ చేసిన ఓల్గా కార్మోనా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ స్థాయి మేర రాణించలేకపోయింది. మరోవైపు టోర్నీలో స్పెయిన్ ఆరంభం నుంచే మంచి ప్రదర్శన చూపించింది. బంతిని ఎక్కువ సమయం స్పెయిన్ జట్టు ఆధీనంలో ఉంచుకుంది. స్పెయిన్ 14 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా.. ఇంగ్లాండ్ 7 సార్లు మాత్రమే ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి చేసింది. 29వ నిమిషంలో ఓల్గా కార్మోనా గోల్ చేసి స్పెయిన్ ఖాతా తెరిచింది.
Kishan Reddy : బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
మరోవైపు స్పెయిన్ డిఫెన్స్ టీమ్ మాత్రం ఇంగ్లాండ్‌కు గోల్ చేసే అవకాశాలను ఇవ్వలేదు. గోల్‌పోస్టు వద్ద ఇంగ్లాండ్ చేసిన మూడు ప్రయత్నాలను స్పెయిన్ గోల్‌కీపర్ కాటా కోల్ అడ్డుకుంది. అదనపు సమయంలోనూ ఇంగ్లాండ్ స్కోరును సమం చేయలేకపోయింది. దాంతో చివరి వరకూ ఏకైక గోల్‌తో ఆధిక్యాన్ని కాపాడుకున్న స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. దీంతో తొలిసారి వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలవడంతో మైదానంలో స్పెయిన్ మహిళల సంబరాలు అంబరాన్నంటాయి. అటు తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌కు నిరాశ తప్పలేదు. జపాన్‌కు చెందిన హినాటా మియాజావా ప్రపంచకప్‌లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బూట్ అవార్డు అందుకుంది. స్పెయిన్ క్రీడాకారిణి ఐటానా బొన్మతీ గోల్డెన్ బాల్ అవార్డు అందుకోగా.. ఇంగ్లాండ్ గోల్‌కీపర్ మేరీకి ఇయర్ప్స్ గోల్డెన్ గ్లవ్ అవార్డు దక్కింది.
Woman Beats Husband: మద్యానికి బానిసైన భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన భార్య
ఈ ఏడాది ఫిఫా మహిళల వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. స్వీడన్, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సెమీస్ లోనే వెనుదిరిగాయి. వర్గీకరణ మ్యాచ్ లో నెగ్గిన స్వీడన్ కు 3వ స్థానం లభించగా, ఆస్ట్రేలియాకు 4వ స్థానం దక్కింది. విజేతగా నిలిచిన స్పెయిన్ అమ్మాయిల జట్టుకు రూ.35 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. రన్నరప్ గా సరిపెట్టుకున్న ఇంగ్లండ్ రూ.25 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!