సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. breaking news, latest news, telugu…
వికారాబాద్ జిల్లాలో ఆశ కార్యకర్తలకు ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశ కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రాణాలను…
రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కోవిడ్ లక్షణాల బారిన పడుతున్నారు జనాలు. ఫీవర్ సర్వే ప్రారంభం అయిన 9 రోజుల్లోనే 4,00,283 మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈనెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల ద్వారా స్పష్టమైంది. అయితే కోవిడ్ వ్యాధిపై అవగాహన…
ఫీవర్ సర్వేతో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా తగ్గినట్టు వెల్లడించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడాన్ని అభినందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే…
రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా, జ్వర సర్వే, వాక్సినేషన్ అంశాలపై సోమవారం వైద్యారోగ్య అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కట్టడి కోసం మొదలు పెట్టిన ఫీవర్ సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఒకవైపు కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో పాటు,…
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. అయితే ఒకరోజు తగ్గితే మరోరోజు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం రాష్ట్రంలో 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,393 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212 కాగా, మరణాల సంఖ్య 4,071గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,95,942గా ఉంది. రాష్ట్రంలో…
తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారని తెలిసింది. ఇప్పటివరకు 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారు 1,28,079 మంది ఉన్నారు. వీరిలో 1,27,372 మందికి మెడికల్ కిట్లను ఆరోగ్య సిబ్బంది పంపిణీ చేశారు. చాలా మందిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా…
కరోనా పట్ల తన నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం నింపేందుకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ -19 బారిన పడిన పలువురితో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని కోరారు. కోవిడ్-19 రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం మరియు ఆయన స్వయంగా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఫీవర్ సర్వే సందర్భంగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. “మీరు తప్పనిసరిగా మెడికల్ కిట్ తీసుకోవాలి…
కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేను రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెల్సిందే.. సిద్ధిపేట పట్టణంలోని పలువార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని అదరిని టీకా తీసుకున్నారా లేదా అని మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. నిన్న ఒక్క రోజే 12 లక్షల మందికి పరీక్షలు చేశారు వైద్యాధికారులు. హోమ్…
మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశవ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు పరుగులు పెడుతున్నాయి.. మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది.. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఫీవర్ సర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్ కిట్లు,…