వికారాబాద్ జిల్లాలో ఆశ కార్యకర్తలకు ఎంపీ, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య శాఖకు తోడుగా ఆశ కార్యకర్తలు నిలబడి సహకారం అందించటం గొప్ప విషయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రాణాలను ఫణంగా పెట్టి ఆశ వర్కర్లు చేసిన సేవ ఎంతో గొప్పదని ఆమె అన్నారు.
కోవిడ్‌లో బాగా కష్టపడ్డ వారి కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ లు అందిస్తున్నారన్నారు. ఆశ కార్యకర్తల జీతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ 3 వేల నుండి 9 వేలకు పెంచారన్నారు. కోవిడ్ లో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల సదుపాయాలు కల్పించారని ఆమె వెల్లడించారు.