సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. రాష్ట్రంలో గతంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి జ్వర బాధితులను గుర్తించారు. అంతేకాకుండా వారికి వెంటనే పరీక్షలు చేసి.. అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు అందించిన సంగతి తెలిసిందే. ఫీవర్ సర్వేలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంటింటికి వెళ్లనున్న వైద్యశాఖ సిబ్బంది.. డెంగ్యూ, మలేరియా వ్యాధులున్నవారి గుర్తించనున్నారు.
Also Read : Nepal PM Wife Passes Away: నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
కరోనా వ్యాప్తి సమయంలో వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి, లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రారంభ దశలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా వ్యాధుల నియంత్రణకు సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 విడతలు రాష్ట్రంలో సర్వే నిర్వహించారు. ఇదే తరహాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నియంత్రణకు సర్వే చేపడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులున్న వారిని, లక్షణాలున్నవారిని గుర్తిస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. బాధితులకు మందులు అందిస్తారు. అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తారు. సీజనల్ వ్యాధులను గుర్తించడానికి ఫీవర్ సర్వే యాప్లో మార్పులు చేశామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
Also Read : Rashmika Mandanna Selfie: సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫాన్స్.. అభిమాని చేసిన పని షాక్ తిన్న రష్మిక మందన్న!