యోగి సర్కార్ గుడ్‌న్యూస్.. విద్యుత్ చార్జీలు భారీగా తగ్గింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం రోజు విడుదల చేసింది… ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది.. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ పోలింగ్ ప్రారంభం కాబోతోంది.. అయితే, ఎన్నికలకు ముందు సామాన్యులకు, రైతులకు భారీ ఊరట కలిగించేలా శుభవార్త వినిపించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.
Read Also: ఆ మోజు ఉంటే చంద్రబాబు రాజీనామా చేయాలి-రోజా
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు అమలు అవుతోన్న విద్యుత్ చార్జీల్లో భారీగా కోత విధించింది.. రైతులకు ప్రయోజనం కలిగేలా బోరు బావుల విద్యుత్ బిల్లులను తగ్గించింది. పట్టణాల్లో మీటరు ఉన్న బోరుబావుల కనెక్షన్ల యూనిట్ ధరను రూ.6 నుంచి రూ.3కు కుదించిన యోగి సర్కార్.. గ్రామీణ మీటర్ల పంప్ కనెక్షన్ల యూనిట్ ధరను రూ.2 నుంచి రూ.1కి పరిమితం చేసింది. ఇక, టౌన్లలో ఫిక్స్‌డ్ చార్జీల రేటు హార్స్‌పవర్‌కు రూ.130 నుంచి రూ.65కు… గ్రామాల్లో రూ.70 నుంచి రూ.35కు కుదించిన బీజేపీ ప్రభుత్వం.. మీటర్లు లేని కనెక్షన్లకు రేటును హార్స్‌పవర్‌కు రూ.170 నుంచి రూ.85కు తగ్గించింది.. విద్యుత్ చార్జీల తగ్గింపుపై సోషల్ మీడియాలో స్పందించిన సీఎం యోగి ఆదిత్యానథ్.. రైతులు ఆనందంగా ఉంటేనే ఉత్తరప్రదేశ్ స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.. అందుకే రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. ఈ నిర్ణయం తీసుకుంది యూపీ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!