కేంద్రంపై అసత్య ప్రచారం మానుకోండి.. పీయూష్ గోయల్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తున్నది.ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం.
అదనంగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచాం అన్నారు మంత్రి పీయూష్ గోయల్. 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం జరిగింది.ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చాం. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. ఇప్పటికీ 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ,13 లక్షల టన్నుల రారైస్ ఇవ్వాల్సి ఉంది. నాలుగుసార్లు గడువు కూడా పొడిగించాం.
Also Read
దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారు. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పాం. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పక్షాన ఉందన్నారు. మేం గత ఐదేళ్లలో కొనాల్సిన ధాన్యం కంటే.. మూడు రెట్లు ఎక్కువే కొన్నాం.
ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచి ఇచ్చాం. నాలుగేళ్లకు సరిపడ బాయిల్డ్ రైస్ ఉన్నా.. రైస్ తీసుకుంటామని చెప్పాం.భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ సంతకం చేశారు. రా రైస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ మంత్రులను నేడు ఢిల్లీకి ఆహ్వానించలేదు.నేను ఢిల్లీలో లేనప్పుడు ఎందుకు వచ్చారు, ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ మంత్రులకు.. ప్రజలకు సేయడం కంటే, ఢిల్లీలో కూర్చోవడంపైనే ఆసక్తి ఉంది. తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!