రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం అని పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్ గారిని తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా?…
వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని విమర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.. రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు.
వైఎస్ జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం, అందుకే రైతుల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులకు న్యాయం చేయకుండా.. పవన్ నిద్రపోతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత కాలం పవన్ నిద్రపోతానే ఉంటారు ఏమో? అని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదున్నారు. 1995లో సీబీఎన్ బాగుండేదని.. ఇప్పటి సీబీఎన్ చాలా…
పరామర్శల పేరిట ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. మిగతావాటి వ్యవహారం, చుట్టూ మసురుకున్న వివాదాల సంగతి పక్కనబెడితే.... రైతుల కోసం చేస్తున్న పరామర్శ యాత్రలకు మాత్రం స్పందన బాగుందన్న అభిప్రాయం పెరుగుతోందట పార్టీ సర్కిల్స్‌లో. ముందు గుంటూరు మిర్చి యార్డ్‌కు, ఆ తర్వాత పొగాకు రైతుల కోసం ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్ళారాయన. ఆ రెండు పర్యటనలు సక్సెస్ అన్న రిపోర్ట్ రావడంతో...ఇప్పుడిక మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు…
రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలన్నారు. ఎప్పుడైనా మామిడిని రైతుల వద్ద నుండి వైసీపీ కొనిందా?, గిట్టుబాటు ధర ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రెండు సార్లు తమ ప్రభుత్వమే మామిడికి గిట్టుబాటు ధర ఇచ్చింది అని చెప్పారు. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు…
MLA Peddireddy: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడు అని ప్రశ్నించారు.
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఈ రోజు 1,551.89 కోట్ల రూపాయలను విడుదల అయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16న వ్యవసాయ యూనివర్సిటీలో ‘రైతు నేస్తం’ కార్యక్రమం జరగనుంది.