MLA Kandala: అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వడంలేదంటూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని రైతులు ప్రశ్నించారు. దీంతో రైతు దినోత్సవం కాస్త రసాభసగా మారింది. రైతుల ప్రశ్నలకు కందాల సమాధానం చెప్పలేక పోయారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రైతు దినోత్సవంలో రైతు ప్రశ్నిస్తున్నా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి వద్ద రైతు దినోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా రైతులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మైక్ లో మాట్లాడుతున్న క్రమంలో ఒకరైతు లేచి ఏం చేస్తున్నారని సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రాంతం అంతా సైలెంట్ గా అయ్యింది. ఎమ్మెల్యేను రైతు నిలదీయడంతో ఎమ్మెల్యే రైతుకు సమాధానం చెబుతున్నా అయినా రైతు ప్రశ్నలు అడుగుతూ తన సమస్యలు చెబుతునే నిలదీశాడు. రైతులు అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. వడ్ల బస్తాకి పది కిలోల కట్టింగ్ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకి, ఎమ్మెల్యే కందాలకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ దశాబ్ది వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న రైతు సంబరాలలో రైతుల దుస్థితిపై రైతుల ఆగ్రహ వ్యక్తం చేశారు. సంబరాలు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ వేదికపైనే ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా వేడుకలు ఎందుకంటూ రైతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కందాల… రైతుల మధ్య కాసేపు వాగ్యాదం చోటుచేసుకుంది. కందాల చెబుతున్న రైతులు పట్టించుకోకుండా ఎమ్మెల్యేను నిలదీయడం పై అక్కడ కాసేపు గందర గోళ పరిస్థితి నెలకొంది.
Odisha Train Accident LIVE UPDATES:పెనువిషాదం.. ఒడిశాకు బయలుదేరిన ప్రధాని మోడీ