Errabelli Dayakar: రైతును రాజును చేసిందే సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ అన్నారు. వరంగల్ జిల్లా తెలాంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో రైతు దినోత్సవ వేడుకలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నరేందర్, కలెక్టర్ ప్రావిణ్య పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 5 గంటల మాత్రమే కరెంట్ ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మాత్రం 24 గంటలు వ్యవసాయనికి కరెంట్ ఇస్తున్నారని తెలిపారు. రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు,9 ఏళ్లలో 57 కోట్లు రైతులకు అందించామని గుర్తు చేశారు. రైతును రాజు చేసింది సీఎం కేసీఆరే అని గుర్తు చేశారు. పంట సాగు కాలాన్ని ముందుకు తీసుకుపోవాలని అన్నారు. జూన్ 10నాటికి వరి నాట్లు పూర్తి చేస్తే నష్టం నుంచి బయట పాడుతామని సూచించారు. దొడ్డు వడ్లు సాగు నిలిపి.. సన్న వడ్లు సాగు చేయాలని రైతులకు సూచించారు. 100 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు.
Read also: Metro facility: మాకోరిక అదే.. కేటీఆర్ సార్ మాక్కూడా ప్లీజ్
అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. విత్తనాలు వేసేవారికి కొద్ది రోజులు ఆగాలనీ సూచించింది. ఇప్పట్లో విత్తనాలు వేయకూడదని హెచ్చిరికలు జారీ చేసింది. జూన్ నెల ప్రారంభం కాగానే వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం చల్లబడుతుంది. కానీ జూన్ నెల ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలు, వడగళ్ల వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడమే ఇందుకు కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఏటా జూన్ మొదటి వారంలో కేరళను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశిస్తే ఎండలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
MLC Kavitha: హ్యాపీ బర్త్‌డే బావా.. ఆప్యాయంగా విష్ చేస్తూ కవిత ట్వీట్