KCR: కేసీఆర్ జిల్లాల పర్యటన.. ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padmavati Express: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాలో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులను ప్రోత్సహించనున్నారు.
Read also: Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 2న మోడీ సభ!
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ నేతలతో సమావేశమై తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కడియం శ్రీహరి తెలిపారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని కడియం కావ్య ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఇతర నేతలు పార్టీని వీడారు. నేతలు పార్టీని వీడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీని వీడేటప్పుడు విమర్శిస్తున్నారని.. అందుకే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.. అందరికీ కాలమే సమాధానం చెబుతుందని.. ఓ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా పార్టీ సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలు తగిన సలహాలు ఇచ్చారు.భవిష్యత్తులో వచ్చి కేసీఆర్ కాళ్లపై పడితే కూడా వారిని పార్టీలోకి రానివ్వబోమన్నారు.
Mukhtar Ansari : ముఖ్తార్ మృతదేహం చూసేందుకు భారీగా తరలివచ్చిన మద్దతుదారులు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!