వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్లసూర్యప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లా కోడుమూరులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గడప గడపకు వెళ్లే ధైర్యం లేక.. పోలీసుల సాయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు ముద్దులు పెట్టాడు..ఇపుడు గుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు.
ప్రభుత్వం చేసింది శూన్యం.. అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యం గురించి చెబుతాం అన్నారు. వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టు పనులను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పూర్తి చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి సాగు, తాగునీటిని అందిస్తాం. ఆలూరులో రైతుల కోసం టమోటా ఫ్యాక్టరీ నిర్మిస్తాం అన్నారు. వైసీపీని నమ్మి మోసపోయారు.. మమ్మల్ని నమ్మండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు కోట్ల ప్రకాష్ రెడ్డి. రైతులను కాపాడే బాధ్యత మాదన్నారు టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అంతర్ధానం అయింది. ఈ నేపథ్యంలో కోట్ల 2024 ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎన్నికల నాటికి టీడీపీని పటిష్టం చేస్తామంటున్నారు.
ATM QR Code : ఇక నుంచి.. క్యూఆర్ కోడ్‌తో ఏటీఎంలో మనీ డ్రా..