జగన్ పాలనలో రైతుల్ని దగా చేశారని మండిపడ్డారు టీడీపీ నేత, పార్వతీపురం టీడీపీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైసీపీ సర్కార్ తీరుపై ఆమె మండిపడ్డారు. వైసీపీ పాలనలో మూడేళ్లగా రైతులకు అన్నీ కష్టాలే పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు గుమ్మడి సంధ్యారాణి.హుద్ హుద్ తుఫాను సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి తుఫాన్ బాధితులకు సహాయం అందించారు.
Read Also: Doctor- Dog Video Viral: కుక్కపై వైద్యుడి పైశాచికం తాడుతో కట్టి కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ..
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్ని తుఫాన్లు వచ్చినా బాధితుల ముఖం చూడడం లేదు. నష్టపరిహారం ఊసే లేదు. రైతు రాజ్యమని చెప్పుకోవడమే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే సమస్యలపై నోరు విప్పని మంత్రులు ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అమరావతి రైతులను జిల్లాలో అడుగుపెట్టనివ్వమని జిల్లా మంత్రులు అంటున్నారు. అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది. వాళ్ళ వెన్నంటే ఉండి పాదయాత్ర విజయానికి అండగా ఉంటుందన్నారు.
Read Also: Chandigarh University Case : చండీగఢ్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 24 వరకు బంద్