రైతులకు కనీస మద్ధతు ధర ఖచ్చితంగా చెల్లించేలా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jaganmohan Reddy) ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలి. మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు జగన్.
క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ కార్డులు (soil Cards) ఇవ్వాలి. సాయిల్ కార్డులతో పాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటలసాగుపై సలహాలు అందించాలి. ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోండి. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదు. రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందే. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు జగన్.
Billionaire in One Minute: నిమిషంలోనే బిలియనీర్.. యువకుడి ఖాతాలోకి రూ.6,833 కోట్లు