Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశామని.. అందులో ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని ఆయన తాజాగా విలేకర్ల సమావేశంలో అన్నారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. ఎరువుల కొరత రాకుండా…
Nadendla Manohar : ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విస్మరించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674 కోట్ల మేర బకాయిలను వెంటనే చెల్లించామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.…
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పంటల రక్షణ కోసం కొత్త స్కీం తీసుకురానుంది. దీంతో పాటు.. రైతుల అవసరాలకు సంబంధించిన పరికరాలను అందించే యోచనలో సర్కార్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. * KCC ద్వారా లోన్ల పెంపు:…
Tummala Nageswara Rao : కీలక సంక్షేమ పథకాలు జనవరి 26 నుండి అమలు కాబోతున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక సర్వే చాలా పకడ్బందీగా చేయాలన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదని, అనర్హులకు ఏ ఒక్క సంక్షేమ పథకం చేరకూడాదన్నారు. వచ్చే వారం రోజులు ఉద్యోగులు చేసే సర్వే అధికారులకు, ప్రభుత్వానికి కీలకమని, గత ప్రభుత్వం…
TG Cabinet Meeting : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, ‘రైతు భరోసా’ పథకం విధివిధానాలు ఖరారు చేయడం ఈ భేటీకి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రైతు భరోసాపై కొన్ని సిఫార్సులు రూపొందించింది. వీటిలో పంట వేసిన ప్రతి రైతుకు పెట్టుబడి…
Minister Nimmala Rama Naidu: ఆరేళ్ల అనంతరం నిర్వహించిన సాగు నీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం చేకూరిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు అన్నదాతలు ఏకపక్షంగా మద్దతు పలికారని ఆయన వెల్లడించారు. ఐదేళ్లపాటు నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టు అంటూ వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక పాలనతో రైతులు విసుగెత్తిపోయారన్నారు. Read Also: Minister…
తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది వరి దిగుబడిలో కొత్త రికార్డులను సృష్టించబోతుందని, 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడికి అవకాశం ఉన్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడిని చూడబోతున్నామని, అందులో 91 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసే అవకాశముందని చెప్పారు.