ఆంధ్రప్రదేశ్‌లో పోరుబాట పట్టింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, అందులో భాగంగా.. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు.. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ.. రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పెట్టుబడి, గిట్టుబాటు ధర.. ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా…
రాష్ట్రంలో అనుకోకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది.
కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతాంగంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే పంట విరామ నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. కోనసీమ రైతులకు అండగా జనసేన.వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు.కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదన్నారు పవన్…
సాగు సమస్యలు పరిష్కారం కాక … అష్ట కష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈ ఖరీఫ్ లో క్రాప్ హాలీడే పాటిస్తే కనీసం పెట్టుబడి డబ్బులు అయినా మిగులుతాయని కోనసీమ వరి రైతులు పంట విరామానికే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. క్రాప్ హాలీడేకి సిద్ధమవుతున్న రైతుల ఆలోచన ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా.. మంత్రి విశ్వరూప్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి కారణం అవుతున్నాయి. కోనసీమ జిల్లాలో క్రాప్ హాలీడే రైతులపై రాష్ట్ర…