దేశంలో దొంగనోట్లు వరదలా వచ్చిపడుతున్నాయి..ఎటు చూసినా దొంగనోట్ల ముఠాలే పట్టుబడుతున్నాయి.. చేతిలోకొచ్చే ప్రతి కరెన్సీ నోటు అసలుదా, నకిలీదా అని చెక్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని… రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని అనుకునేవాళ్లు పెరుగుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా అనేక చోట్ల నకిలీ నోట్లకు అడ్డాలు తయారవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. అటు కావలి నుండి ఇటు శ్రీకాకుళం వరకు… ఇటు సత్తుపల్లి నుండి హైదరాబాద్ వరకు…
గుంటూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. కొందరు వ్యక్తులు కరెన్సీ నోట్లను కలర్ జిరాక్సు తీసి చలామణి చేస్తున్నారు. దీంతో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు కనిపెట్టారు. ముఖ్యంగా మేడికొండూరు, నడికుడి ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కలర్ జిరాక్స్ ద్వారా నకిలీ నోట్లు తయారుచేస్తున్నారు. ముఖ్యంగా రూ.500, రూ.200 నోట్లు ముద్రించి సుమారు రూ.2.2 లక్షల మేర తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ముఠా సభ్యులు చలామణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.…
హైదరాబాద్ లో ఒక వైపు గంజాయి, డ్రగ్స్ మరోవైపు నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్ల నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద ఉన్న బ్యాగులో 500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ ఐ దాస్, లక్ష్మీ నారాయణలతో కలిసి పట్టుకున్నారు గోల్కొండ ఇన్ స్పెక్టర్ సముద్ర శేఖర్. 7 టూంబ్స్ బస్…
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరి ముఖ్యంగా 2000, 500 నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు ముఠా యత్నంచింది. కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహారించి కేసును చేదించారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘నిందితుల నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ,…
హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ ముఠా లోని ఐదుగురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండివ1500 నకిలీ 500 రూపాయలవి సీజ్ చేశాము. అలాగే రద్దయిన 500 రూపాయలు నోట్లు 9 లక్షలు సీజ్ చేశాము. ప్రధాన నిందితుడు సిద్దిపేట కి చెందిన సంతోష్ కుమార్ తో పాటు… బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సుంకర శ్రీనివాస్…
రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హవాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రాలజిస్ట్ గా చెప్పుకుంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగతనం జరిగింది. రూ.40 లక్షల విలువచేసే జాతిరత్నాలు ఛోరికి గురయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో నకిలీ కరెన్సీ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక మురళీకృష్ణ ఇంటో దొంగతనం చేసిన ఆరుగురు దొంగలను అదుపులోకి తీసకొని విచారించగా విషయం బయటపడింది. ఈ…