అసలు, సొల్యూషన్ ఈవీఎంలది కాదు అన్నారు.. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వస్తే న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందన్నారు.. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగల పర్యవేక్షణ ఉంటుందన్నారు.. అప్పుడు ఎలాంటి మెకానిజం తీసుకువచ్చిన ఇబ్బంది లేదు అన్నారు.. అయితే, పేపర్ బ్యాలెట్ అయితే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు.
ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు ఆర్కే రోజా.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు
Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ 100కి పైబడి సీట్లలో పోటీ చేస్తే కేవలం 16 చోట్ల విజయం సాధించింది.
ఈవీఎంల వ్యవహారంపై ఆగస్టు 13వ తేదీన హైకోర్టులో పిల్ వేశారు బాలినేని.. అంతేకాదు.. ఆ పిల్‌పై ఆగస్టు 15వ తేదీన వాదనలు వినిపించారు బాలినేని తరుపున న్యాయవాది ఆలపాటి వివేకానంద.. ఇక, ఆగస్టు 17వ తేదీన తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు.. ఈరోజు బాలినేని పిల్‌పై తుది తీర్పును వెలువరించనుంది హైకోర్టు..
దేశంలో శనివారం మరో రసవత్తర పోరుకు హర్యానా రాష్ట్రం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశ ప్రజల చూపు హర్యానాపై ఫోకస్ మళ్లింది. ఇక్కడ కాంగ్రెస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతులకు ఇవాళ మాక్ పోలింగ్, రీ చెకింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ రీ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేశారు.