తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్ ఎన్నికలు కాక రేపాయి. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయి వుంది. అయితే రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి…