టెక్నికల్గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు. మంత్రులు పనిచేసిన గ్రామాల్లో కూడా వారి చెంప చెళ్లుమనిపించారు. కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. డబ్బు సంచులు, మద్యం బాటిల్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం పనిచేయదని మరోసారి నిరూపితమైందన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శామీర్ పేట నివాసం నుండి ఆయన మాట్లాడుతూ.. ఫలితాల్లో జాప్యం తగదని మండిపడ్డారు.
రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని, సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతోపాటు జిల్లా ఇంఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్…
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌసిక్ రెడ్డి ఈటల రాజేందర్ పై సంచళన వ్యాఖ్యలు చేసారు. ఈటల హుజురాబాద్ లో యాక్టర్, హైదరాబాద్ లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్ అంటూ విమర్శించారు. హుజురాబాద్ ప్రజలు ఏమి అన్యాయం చేశారని గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని అంటున్నావు ? అంటూ ప్రశ్నించారు. ఆగస్టు 5 న హుజురాబాద్ అభివృద్ధి పై చర్చకు ఈటల రాజేందర్ రావాలని సవాల్ విసిరారు. తను విసిరిన సవాల్ ను ఈటల రాజేందర్ స్వీకరించే దమ్ముందా…
ఆర్టీసీ ప్రైవేటీకరణపై చైర్మన్ బాజిరెడ్డి కీలక ప్రకటన చేశారు. నిజమాబాద్ నగరం లో సిటీ మెట్రో బస్సు సర్వీసులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే భిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీని అభివృద్ధి లోకి తెచ్చే సలహాలు ఇవ్వాలి తప్పా.. చౌకా బారు ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించారు. త్వరలో 1000…
శాసనసభలో స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్తానాలు సరిదిద్దలేవని, ఆ బాధ్యత స్పీకర్‌దే అని హైకోర్టు పేర్కొందని సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఐతే, స్పీకర్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదని, ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని ఈటల అన్నారు. ఈ అంశంపై సభ అభిప్రాయం కోరమని అడిగినా స్పీకర్ పట్టించకోలేదన్నారాయన. స్పీకర్ వ్యవహార శైలి చూస్తుంటే ఉత్తర కొరియా గుర్తుకు వస్తోందని, చప్పట్లు కొట్టలేదని అక్కడ కాల్చి చంపారని, అలాగే అసెంబ్లీ లో చప్పట్లు కొట్టలేదని…
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు…
దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఈటల రాజేందర్ అన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆరే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ బీజేపీ నిరసన సభలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఉద్యోగ వర్గానికి సంఘీభావం కోసం బీజేపీ నేతలను రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ప్రభుత్వం విమర్శించే కన్నా ముందుగా మీరు చేయాల్సింది స్థానికత ఆధారంగా ఉద్యోగులను సవరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోను రద్దు…
సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ లో బెయిల్ పై విడుదల అయిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మీడియా పై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి భయపెడుతున్నారని మండిపడ్డారు. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి సవరణ చేసి…
ఈ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలువుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బండి సంజయ్ జాగరణ దీక్షను అడ్డుకోవడం పై ఆయన సోమవారం మాట్లాడుతూ ..కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కేసులకు భయపడబోదన్నారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. ప్రగతి భవన్‌కు ఇనుపకంచెలు, ఫాంహౌస్‌కి గోడలు కట్టుకుని ఉంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ఒక చక్రవర్తిలా ఎవరి మాట వినను అంటున్నాడని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయని సంజయ్ తన…