పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదని అన్నారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
కేంద్ర మంత్రి అమిత్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ కాలేదు. ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్నా అమిత్ షా బిజీగా ఉండడంతో సమావేశం రద్దయింది. అమిత్ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని కేంద్ర హోంశాఖ అధికారులు కేటీఆర్ కు సమాచారం అందించారు.
తెలంగాణ బీజేపీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నాయకులు సపోర్టు ఇస్తున్నారు. ప్రభుత్వం దర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా జేపీఎస్ ల సమ్మెకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు.
Etala Rajender: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన పేరును ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు.
హరీష్ రావు మీ గొప్ప దార్శనికతను అమల్లో చూపించండి అంటూ చురకలంటించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా ఆయన మాట్లాడుతూ..బడ్జెట్ అంత అంకెల గారడే అంటూ విమర్శించారు. 70-80 శాతం నిధులు విదులుకావాలన్నారు
ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంచరాలు జరుగుతున్న వేళ బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదని ఎద్దేవ చేశారు.
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి గులాబీ గూటికి చేరతారనే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ గులాబీ కండువా కప్పుకుంటారని, ‘ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫొటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతుండగా.. ఈ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు.
ఎన్నికల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని బిజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. వెంట వెంటనే ఫలితాలు ఇవ్వాలని కోరారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు.