Etala Rajender: టెక్నికల్ గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etala Rajender: మునుగోడు ఫలితాల్లో జాప్యం తగదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. శామీర్ పేట నివాసం నుండి ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగారని అన్నారు. మునుగోడులో ఓడిపోతే పార్టీ భవిష్యతే ప్రశ్నార్ధకమవుతుందని భావించి ఆయనతో సహా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డపెట్టాలి అని ఆదేశించారని ఆరోపించారు. టెక్నికల్గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు. మంత్రులు పనిచేసిన గ్రామాల్లో కూడా వారి చెంప చెళ్లుమనిపించారు. కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. డబ్బు సంచులు, మద్యం బాటిల్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం పనిచేయదని మరోసారి నిరూపితమైందన్నారు. హుజురాబాద్, దుబ్బాకలో చెప్పిన కూడా కేసీఆర్ కి ఇంకా జ్ఞానోదయం రాలేదని విమర్శించారు.
Read also: Munugode Bypoll Results: బీజేపీ అభ్యర్థిని కలిశాడు..! అడిషనల్ ఎస్పీపై వేటు
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
మునుగోడులో కూడా అదే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న నల్లగొండ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడం గొప్ప పరిణామంగా భావిస్తున్నానని, ఒక నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి దబాయించి పనిచేయగలిగాడు రేపు జనరల్ ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితి ఉండదని అన్నారు. మునుగోడు ప్రజా స్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపు. మార్పుకు నాంది. కేసీఆర్ నమ్ముకున్న డబ్బు-మద్యంకు కాలం చెల్లిందని అన్నారు. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మ్రోగిస్తుంది అనడానికి మునుగోడులో భారతీయ జనతా పార్టీ పోరాటం నిదర్శనమన్నారు. నైతికంగా బీజేపీ విజయం సాధించిందని అన్నారు. కేసీఆర్ నైతికత కోల్పోయారని, సీఎం రోడ్లు రావు, మోరీలు రావు, అభివృద్ధి జరగదు అంటూ బెదిరించిన కూడా ప్రజలు అభివృద్ధి కంటే ఆత్మగౌరవం ముఖ్యమని బీజేపీకి ఓట్లు వేశారని ఈటెల రాజేందర్ అన్నారు.
Read also: Video Call Fraud: యువతి అందాలకు ఫ్లాట్.. నగ్న వీడియో కాల్‌కి బుక్
TRS గెలిస్తేనే రేపు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉండదు అని హుకుం జారీ చేసి అధికారులందరినీ చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ అడుగులకి మడుగులు వత్తే విధంగా పని చేయించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించి, దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. వందల కోట్ల రూపాయలు పోలీసు వాహనాల్లో తీసుకువచ్చి ప్రజలకు పంచిపెట్టారని మండిపడ్డారు. వందలలారీల లిక్కర్ తీసుకువచ్చి ప్రజలకు తాగిపించారు. అనేక బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు.
Etala Rajender: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుంది
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!