Minister Jagadish Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
Errabelli Dayakar Rao : తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకే మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ జరుగుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు నేను కలిసి పని చేశామని గుర్తుకు చేసుకున్నారు.