armers: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నగదు పంపిణీ తేదీ ఖరారైంది. ఈనెల 12 నుంచి రైతులకు సాయం పంపిణీ చేయనున్నారు.
Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
హరిత కాకతీయలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందనీ చెప్పుకుంటున్నారని.. ఆయన చేసిందేమీ లేదని మంత్రులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్‌కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని.. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌లకే దక్కుతుందన్నారు.
ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై విద్యుత్ భారం పెంచుతామంటే వ్యతిరేకించాం తప్ప, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరించామని ఆయన తెలిపారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ క్రమంలో విపక్ష నేతలతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పిచ్చోడని.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడని.. రేవంత్ రెడ్డికి మెదడు లేదని ఆయన విమర్శించారు.