Save Trees Maharashtra: మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత…
హెచ్‌సీయూ 400 ఎకరాల భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూ వద్ద ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని ఆయన అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఐఎంజీ భారత్ అనే సంస్థకు కేటాయించిన భూమిని వైఎస్ ఆర్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ట్విట్టర్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుంది. కంచే-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను,” అని కేటీఆర్…
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7 శాతం పెరిగిందని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్…
Anil Kumar Yadav : రాజ్యసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మూసీ నది ప్రస్తావించారు. దేశంలోని ముఖ్యమైన నదుల్లో మూసీ నది ఒకటని, గతంలో దీన్ని ముచ్‌కుందా అనే పేరుతో పిలిచేవారని గుర్తు చేశారు. ఈ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉద్భవించి, హైదరాబాద్ నగరాన్ని దాటి నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల గుండా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుందని వివరించారు. మూసీ నది గాఢమైన చరిత్రను కలిగి ఉందని, హైదరాబాద్…
ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షోభానికి గురువుతున్నారు. అనేక కారణాల వల్ల పిల్లల వలసలకు గురువుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే పిల్లల వలస పెరిగిందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) శుక్రవారం వెల్లడించింది. అనేక కారణాల వల్ల సొంత ప్రాంతాలను వదిలి ఇతర దేశాలకు పిల్లలు శరణార్థులుగా వెళ్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 36.5 మిలియన్ల పిల్లలు 2021 చివరి నాటికి ఘర్షణ, హింస ఇతర సంక్షోభాల కారణంగా సొంత ప్రాంతాలను వదిలి వెళ్లారు. దాదాపుగా…