Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7 శాతం పెరిగిందని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి ముప్పుగా మారుతాయని, పైగా అవి పక్షులకు కూడా సహజ వాతావరణాన్ని అందించలేవని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ చెట్లు కొద్ది మాత్రమే నాటినట్లు సమర్థించగా, స్పీకర్ పెద్ద ఎత్తున నాటినట్లు స్పష్టం చేశారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయని, కాబట్టి వీటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Hyderabad: దారుణం.. కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేసిన బైక్ రేసర్..