మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలులు (Schools) పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. దీంతో విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని హుశారుగా తరగతులకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేశారు. కాగా.. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నగరంలోని మెహబూబియా స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం సబితారెడ్డి…
అంగన్‌వాడీ టీచర్లతో ప్రత్యేకంగా మాట్లాడి.. పిల్లలంతా సర్కారు బడులకు వచ్చేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సర్పంచ్‌ల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందరినీ బడిబాటలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, పాఠశాల విద్యార్థుల గత విజయాలను వివరించి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని మంత్రి వివరించారు. బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈవోలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా…
ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదన్నారు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకు తనకు తెలియదని ఎద్దేవా చేశారు. పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అని నిలదీశారు. కేవలం తన కుమారుడు మాత్రమే ఇంగ్లీష్…
ఏపీలో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్‌కు సంబంధించి అధ్యయనం చేయాలంటూ ఇటీవల సీఎం కేసీఆర్ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీంతో ఈ కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ నేపథ్యంలో 1వ తరగతి నుంచి 8వ…
జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని, మన ఊరు – మన బడి ని సమర్థవంతంగా అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్ చేసింది. దేశంలో విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాల హక్కులు హరించి విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచేది, లౌకిక తత్వానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం – 2020 ని రాష్ట్రంలో అమలు జరపకుండా తిరస్కరించాలి.…