రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలులు (Schools) పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. దీంతో విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని హుశారుగా తరగతులకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేశారు.
కాగా.. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నగరంలోని మెహబూబియా స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం సబితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మొదటి రోజు స్కూల్స్‌కు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను డెవలప్ చేస్తున్నామన్నారు. 9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంగ్లీషు మీడియం మొదలు పెట్టామని.. ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయన్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియా ప్రవేశ పెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
గురుకులాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గురుకులాలల్లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని, లోపాలు వెతికే ప్రయత్నం చేయవద్దని అన్నారు. మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం చేస్తున్న పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతియేటా మాదిరిగా జులై మొదటి, రెండో వారంలో పుస్తకాలు, యూనిఫార్మ్స్ అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తగతి వరకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 1.04 లక్షల మంది ఉపాధ్యాయులకు అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ ఇప్పిచ్చింది.
TCongress : ఒకరు ఎడ్డం అంటే ఇంకొకరు తెడ్డం అంటున్నారా.? ఇంతకీ టీ-కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?