Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రవేశాల జోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రవేశాల జోరు కొనసాగుతోంది. ప్రైవేట్ స్కూల్స్ నుంచి విద్యార్థులు గవర్నమెంట్ బాట పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 51 వేల 4 వందల 61 మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. దీంతో జూలై 1 నాటికి అన్ని క్లాసులు కలిపి అడ్మిషన్లు పొందిన మొత్తం స్టూడెంట్స్ సంఖ్య లక్షా 70 వేల 59కి చేరింది. సెప్టెంబర్ 30 వరకు అడ్మిషన్లు జరగనుండటంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధిక ప్రవేశాలతో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 15 వేల 636 మంది చేరారు.
ఇందులో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సంఖ్య సగం కన్నా ఎక్కువే (7 వేల 9 వందల 28 మంది) కావటం విశేషం. ప్రభుత్వం చేపట్టిన బడిబాట, మన ఊరు-మన బడి వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయనటానికి ఈ పరిణామమే ప్రత్యక్ష నిదర్శనమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. బడిబాట కార్యక్రమం జూన్ 30తో ముగిసినప్పటికీ ప్రవేశాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం కూడా అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరగటానికి దోహదపడిందని భావిస్తున్నారు. గతంలో గవర్నమెంట్ బడుల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవటంతో మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్‌కి పంపించేవారు.
Also Read
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
తెలంగాణ ప్రభుత్వం ఈసారి పాఠ్యపుస్తకాలను రెండు మీడియాల్లో (తెలుగు-ఇంగ్లిష్, ఉర్దూ-ఇంగ్లిష్, హిందీ-ఇంగ్లిష్) ప్రచురించింది. ఇది విద్యార్థులకు మరింత ఉపకరించనుందని చెప్పొచ్చు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రాథమిక సౌకర్యాలన్నీ సమకూరుతున్నాయి. స్కూల్‌కి కరెంట్ సదుపాయం, పిల్లలకు మంచి నీళ్లు, కూర్చోటానికి బెంచ్‌లు, స్టాఫ్‌కి తగిన సామగ్రి, మరుగుదొడ్లలో నీళ్లు, బడి బిల్డింగులకు పెయింటింగ్, చిన్నా-పెద్ద మరమ్మతులు చేశారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మూడేళ్లలో 7 వేల 2 వందల 89 కోట్ల 54 లక్షల రూపాయలతో అన్ని హంగులూ తీసుకురావాలని తెలంగాణ సర్కారు గట్టి పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?