ఈ ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్‌లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్‌ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం.
ప్రపంచకప్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.