Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తొలి టెస్టు మ్యాచ్ లోని మొదటి ఇన్సింగ్స్ లో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు బాది కేరీర్ లోనే ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ శుభారంభం ఇచ్చారు. 78 బంతుల్లో 42 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ బ్రైడాన్ కార్స్ బౌలింగ్ లో రూట్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇక, మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీ చేసిన తర్వాత బెన్ స్టోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డెబ్యూ ప్లేయర్ సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్ సెంచరీ కొట్టి.. టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.
Read Also: Off the Record: ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అంతా దోచేస్తున్నారా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు?
అయితే, ప్రస్తుతం టీమిండియా స్కోర్ 3 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఇక, క్రీజులో రిషభ్ పంత్ ( 44 పరుగులు నాటాట్), శుభ్ మన్ గిల్ ( 112 పరుగులు నాటాట్) ఉన్నారు. మరోవైపు, ఇంగ్లీష్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీసుకోగా, బ్రైడాన్ కార్స్ ఒక వికెట్ తీసుకున్నాడు.