Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ప్లేయర్లు బ్యాటింగ్ లో రెచ్చిపోతున్నారు. మొదటి రోజు యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీలో అదరగొట్టగా, రెండో రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో దుమ్మురేపాడు. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలతో ఇంగ్లాండ్ పై భారత్ అధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే టీమిండియా స్కోరు 450+ మార్కును దాటింది. అయితే, 99 పరుగుల దగ్గర ఉన్న సమయంలో అద్భుతమైన సిక్సర్ తో పంత్ తన సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. 146 బంతులు ఆడి 105 పరుగులతో శతకం బాదేశాడు పంత్. అయితే, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 71.92 స్ట్రైక్ రేటుతో సెంచరీని బాదాడు.
Read Also: Vladimir Putin: ఇరాన్ అణ్వాయుధాలను కోరుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు..
మరోవైపు, సెంచరీ కొట్టిన రిషబ్ పంత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపర్ గా ఎక్కువ శతకాలు చేసిన ప్లేయర్ గా ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, ప్రస్తుతం టీమిండియా 7 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. అద్భుతమైన శతకం కొట్టిన తర్వాత రిషబ్ పంత్ ( 134) జోష్ టంగ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్, శార్థుల్ ఠాకూర్ వరుసగా బెన్ స్టోక్స్ బౌలంగ్ లో అవుట్ అయ్యారు. ఇక, ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 వికెట్లు తీసుకోగా.. జోష్ టంగ్, బ్రైడాన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా వికెట్ కీపర్లు- అత్యధిక శతకాలు..
* టెస్టుల్లో వికెట్ కీపర్ గా 7 సెంచరీలు సాధించిన రిషబ్ పంత్..
* 6 సెంచరీలతో రెండో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ..
* 3 సెంచరీలతో మూడో స్థానంలో వృద్ధిమాన్ సాహా..
Rishab Pant completes his 7th Test hundred with One handed Six 🔥🔥#INDvsENG #RishabhPant pic.twitter.com/XnEaZDNz7H
— Emperor⚡ (@ImRealEmperor) June 21, 2025