ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్‌లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు.
ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల విలువైన పోంజీ స్కీమ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు పిలిచింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం.. నవంబర్ 20న తిరుచురాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెల్లర్స్‌కి చెందిన భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు సంస్థ సోదాలు అనుసరించి సమన్లు వచ్చాయి.
ఏపీ ట్రాఫిక్ ఈ చలాన్ స్కామ్‌పై కేసు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల ద్వారా వచ్చిన నిధులను అవినాష్ అనే వ్యక్తి దారిమళ్లించినట్టు అభియోగాలు మోపారు.. అవినాష్ కి చెందిన ఇవాల్వ్ సంస్థతోపాటు పలువురుపై కేసు నమోదు చేశారు.. 36 కోట్ల రూపాయలకు పైగా నిధులను దారి మళ్లించారని అవినాష్ పై ఆరోపణలు ఉన్నాయి.
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలపై గురువారం ఈడీ దాడులు చేపట్టగా.. మరోవైపు సీఎం గెహ్లాట్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు.
Shraddha Kapoor: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.. మహదేవ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేస్తున్న నటీనటుల జాబితాలో తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా చేరింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది.