లిక్కర్ పాలసీ కేసులో (Liquor Policy Case) ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు (Delhi CM Arvind Kejriwal) మరోసారి ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ నెల 19న హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో గత నెలలో సమన్లు అందాయి.
Money Laundering Case : కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మరోసారి విచారణకు పిలిచింది. నిన్న, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేంద్ర ఏజెన్సీ రాంచీలో 11 గంటల పాటు విచారించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పని చేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తుంది. సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన నిమిషాల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అంతకుముందు బుధవారం సాయంత్రం, భూ కుంభకోణంలో ఏడు గంటలకు పైగా ఈడీ ప్రశ్నించడంతో హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరుకాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 16న ఈడీ ఎదుట హాజరు కావాలని కవితను ఆదేశించింది. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు కవితను 2022…