ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. ఈ మార్పు పీఎస్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. మీరు కూడా పీఎఫ్ ఖాతాదారు అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
ఖాతాలలోని వివరాలను సరిచేయడానికి, నవీకరించడానికి ఈపీఎఫ్‌వో కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సరిచేయడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) మార్గదర్శకాన్ని జారీ చేసింది. సభ్యుల ప్రొఫైల్‌లను నవీకరించడానికి ఎస్ఓపీ వెర్షన్ 3.0 ఆమోదించబడింది. ఇప్పుడు ఈ కొత్త నియమం తర్వాత, యూఏఎన్ ప్రొఫైల్‌లో అప్‌డేట్ లేదా దిద్దుబాటు కోసం పత్రాలను అందించాలి. డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో తన మార్గదర్శకాల్లో అనేక రకాల పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. డేటా అప్‌డేట్ కాకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని తెలిపింది.
READ MORE: TG High Court Serious: కుక్కలను పునరావాస కేంద్రాలకు పంపండి..
కొత్త మార్గదర్శకాల ప్రకారం రెండు కేటగిరీలలో మార్పులు ఉంటాయి. ఈపీఎఫ్‌వో ప్రొఫైల్‌లోని మార్పులను పెద్ద, చిన్న వర్గాలుగా విభజించింది. చిన్న మార్పులు జాయింట్ డిక్లరేషన్ అభ్యర్థనతో పాటు కనీసం రెండు అవసరమైన పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. పెద్ద మార్పుల కోసం కనీసం మూడు అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి కార్యాలయాలు సభ్యుల ప్రొఫైల్స్‌ను అప్‌డేట్ చేయడంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సంస్థ కోరారు. ఆధార్ సంబంధిత మార్పుల విషయంలో, సక్రియ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన ఆధార్ కార్డ్ లేదా ఇ-ఆధార్ కార్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్‌గా సరిపోతుంది.