Myanmar: ఉద్యోగులకు జీతం పెంచిన యజమానికి జైలు శిక్ష..కారణం ఇదే..?
- ఎక్కువ జీతాలు ఇస్తున్న యజమానులను గుర్తించాలని ప్రభుత్వ ఆదేశం
- మయన్మార్ లో ఆర్థిక సంక్షోభం
- ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు వెళ్లడం వల్లనే ద్రవ్యోల్బణం పెరుగుతోందని భావించిన ప్రభుత్వం
- ఎక్కువ డబ్బులు వస్తే..అవసరానికి మించి వస్తువులు కొంటారని ప్రభుత్వ భావన
- జీతాల పెంపు అశాంతిని రెచ్చగొట్టడం కిందకు వస్తుందని తెలిపిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయన్మార్‌లో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది షాపుల యజమానులు తమ ఉద్యోగులకు జీతాలు పెంచడంతో, వారిని జైలుకు పంపారు. ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని అలాంటి వారి కోసం వెతకాలని ప్రభుత్వం ఆదేశించింది. బహుశా అక్కడ అలాంటి చట్టం ఉందా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అక్కడ ఇలాంటి చట్టం లేదు. మయన్మార్‌లో జీతం పెంచడం చట్టవిరుద్ధం కాదు. అయితే ప్రభుత్వం ఇలా ఆందోళన చెందడానికి ఒక కారణం ఉంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మయన్మార్‌లోని మాండలేలో నివసించే ప్యాయ్ ఫియో జా మూడు దుకాణాల యజమాని. వారు మొబైల్ ఫోన్ వ్యాపారం చేస్తారు. ఈ సంవత్సరం అతను బాగా సంపాదించారు. కాబట్టి అతను తన ఉద్యోగుల జీతాలను పెంచారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ మయన్మార్ సైన్యానికి ఇది నచ్చలేదు. వారు వెంటనే ప్యాయ్ ఫియో జావ్‌ను అరెస్టు చేశారు. వారి దుకాణాలకు కూడా తాళాలు వేశారు. తమ ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ఆన్‌లైన్‌లో వార్తలు వ్యాపించడంతో కనీసం 10 మంది దుకాణదారులు జైలు పాలయ్యారు. ఇది మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షకు దారితీయవచ్చు. జీతం పెరగడంతో చాలా సంతోషించామని, అయితే ఇప్పుడు మా షాప్ మూతపడిందని ప్యా ఫ్యో జా షాప్ ఉద్యోగి తెలిపారు.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
2021లో సైన్యం అధికారం చేపట్టినప్పటి నుంచి మయన్మార్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశానికి సహాయం చేయడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. సైన్యంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాయుధ దళాలు దేశంలోని సగానికి పైగా ఆక్రమించుకున్నాయి. వారే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారు అనేక సైనిక స్థావరాలు మరియు పోస్ట్‌లను స్వాధీనం చేసుకుంటున్నారు. దీని కారణంగా చైనా, భారత్, థాయ్‌లాండ్‌లతో వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు వెళ్లడం వల్లనే ద్రవ్యోల్బణం పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అలా వచ్చిన డబ్బులతో వారు వసరానికి మించి వస్తువులు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారని.. అప్పుడు సరుకుల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. ప్రజల వద్ద డబ్బు లేకపోతే.. వారు తక్కువ ఖర్చు చేస్తారు. ఇది ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది.
READ MORE:Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు..
ఈ కారణంగా.. జీతాల పెంపు అశాంతిని రెచ్చగొట్టడం కిందకు వస్తుందని సైన్యం భావిస్తోంది. ఈ మేరకు ప్యాయ్ ఫియో జాలోని ఒక దుకాణం వెలుపల సైన్యం నోటీసును ఉంచింది. అందులో ‘సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో ఈ దుకాణానికి తాళం వేశారు’ అని రాసి ఉంది. ఇంతకుముందు, బియ్యం, మాంసం మరియు వంట నూనె వంటి ప్రధాన ఆహార పదార్థాలను తక్కువ కొనుగోలు చేయడానికి సైన్యం ఆదేశించింది. బంగారం కొనుగోళ్లు ఆగిపోయాయి. విదేశీ కరెన్సీ కొనుగోలుపై నిషేధం ఉంది. విదేశాలకు డబ్బు పంపడం కూడా నిషేధించబడింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బంగారం, విదేశీ కరెన్సీ, విదేశీ స్థిరాస్తులు విక్రయిస్తున్న 35 మందిని అరెస్టు చేశారు. కేవలం రెట్టింపు ధరకు బియ్యాన్ని విక్రయించినందుకు ఏడుగురు ప్రధాన బియ్యం ఉత్పత్తిదారుల అధినేతలతో సహా 11 మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!