కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేశాయి. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ఉద్యోగులు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ట్విట్టర్ సంస్థ తమ ఉద్యోగులకు జీవితకాలం వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేసింది. ఈ బాటలో మరో ఈ కామర్స్ సంస్థ మీషో కూడా పయనిస్తున్నది. మీషోలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఇకపై ఎక్కడి నుంచైనా పనిచేసుకునే వెసులుబాటును కల్పించింది.
Read: వైరల్: ఆమె ధైర్యానికి సోషల్ మీడియా ఫిదా… కోబ్రాను ఇలా పట్టుకొని…
ఈ విషయాన్ని మీషో వ్యవస్థాపకుడు విదిత్ ఆత్రే ట్వీట్టర్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీషో ప్రకటించింది. పనిచేసే స్థానం కంటే ఉద్యోగుల మానసిక, శారీరక భద్రత ముఖ్యమని ఆత్రే తెలిపారు. బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ, అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చిన్నచిన్న కార్యాలయాలు తెరుస్తామని తెలిపారు.